Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

నేను స్పష్టంగానే ఉన్నా..: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగినప్పుడు తాను అధ్యక్షుడిగా ఉంటానా, లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. తానేం చేయాలనుకున్నానో ఇప్పటికే నిర్ణయించుకున్నానని.. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీ ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో మీడియా ఆయనను కాంగ్రెస్‌ అధ్యక్షుడు అవుతారా అని ప్రశ్నించగా.. ఈ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నవంబర్‌ 17న ఎన్నిక జరగనుంది. రెండు రోజుల తర్వాత ఫలితాలను వెల్లడిరచనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img