Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

పీకే తన పబ్లిసిటీ కోసం నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాడు : బీహార్‌ సీఎం

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నితీశ్‌ కుమార్‌ ఇప్పటికీ బీజేపీతో టచ్‌లో ఉన్నాడని ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన కామెంట్‌ను ఆయన కొట్టిపారేశారు. పీకే తన పబ్లిసిటీ కోసం నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన తన ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసుకోవచ్చని, తాము మాత్రం వాటిని లెక్క చేయమని అన్నారు.ప్రస్తుతం ప్రశాంత్‌ కిషోర్‌ వయసు మీద ఉన్నాడని, కాబట్టి ఏదైనా మాట్లాడగలడని నితీశ్‌ నవ్వుతూ చమత్కరించారు. ఒకప్పుడు పీకే అంటే తనకు మంచి గౌరవ భావం ఉండేదని చెప్పారు. తాను అతడికి గౌరవం ఇచ్చినా అతడు మాత్రం తనను అగౌరవ పర్చాడని నితీశ్‌ కుమార్‌ ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img