Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌

ముగ్గురు ఉగ్రవాదులు హతం
కొన్ని రోజుల నుంచి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం ఉదయం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో పాకిస్తాన్‌కు చెందిన లష్కర్‌ ఉగ్రవాది అజయ్‌ కూడా ఉన్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పుల్వామాలోని జిల్లా ఆసుపత్రి సమీపంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం అందడంతో ఈ ప్రాంతంలో కశ్మీర్‌ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా బలగాలపై ముష్కరులు కాల్పులు జరిపారని కశ్మీర్‌ పోలీసులు వెల్లడిరచారు. అనంతరం బలగాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img