Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

పెట్రోల్‌ , డీజిల్‌ ధరలు పైపైకి…

దేశంలో వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. గత రెండువారాలుగా ధరలను పెంచుతూ వస్తున్న చమురు కంపెనీలు.. తాజాగా మంగళవారం లీటర్‌ పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.61, డీజిల్‌ రూ.95.87కు చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ.119.67, డీజిల్‌ రూ.103.92కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.118.59, డీజిల్‌ రూ.104.62కి పెరిగింది. గత మార్చి 22 తర్వాత ఒకటి రెండు రోజులు మినహా వరుసగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గత 15 రోజుల్లో ధరలు పెరగడం ఇది 13వ సారి. ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై దాదాపు రూ.11 వరకు పెరిగింది. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 3.12 డాలర్లు పెరిగి బ్యారెల్‌కు 107.52 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా డబ్ల్యూటీఐ క్రూడ్‌ కూడా బ్యారెల్‌కు 4.03 డాలర్లు పెరిగి 103.30 డాలర్లకు చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img