Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

పేపర్‌లీక్‌పై యూపీ ప్రభుత్వం చర్చ జరపాలి: ప్రియాంక

న్యూదిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకగాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్‌ లీకేజీపై ప్రభుత్వం తక్షణమే చర్చ చేపట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ కుట్రలో పెద్ద తలకాయల ప్రమేయం కూడా తేల్చాలని కోరారు. ఉత్తరప్రదేశ్‌ సెకండరీ స్కూల్‌ బోర్డ్‌, క్లాస్‌ 12కు చెందిన ఇంగ్లీషు పరీక్ష పేపరు బుధవారం లీక్‌ అవడంతో 24 జిల్లాల్లో పరీక్షను రద్దు చేసిన తరువాతి రోజు ప్రియాంక బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘బీజేపీ ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్చ చేపట్టాలి. గతేడాది నవంబర్‌ 28న యూపీటెట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ అవడంతో లక్షలాదిమంది యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చర్యల పేరుతో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయోజనం లేదని ప్రియాంక గాంధీ తెలిపారు. ఎవరు పేపర్‌ లీక్‌ చేశారనేది ఇప్పటి వరకూ ప్రభుత్వం చెప్పలేదు. దీనికి కారణంగా ఇప్పుడు ఇంకో ఘటన చోటు చేసుకుంది అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వద్రా తెలిపారు. అయితే ప్రస్తుత ఘటనపై కూడా కంటితుడుపు చర్యలే తప్ప ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టదు. కాకపోతే ఈ పేపర్‌ లీక్‌ ఘటనపై రిపోర్ట్‌ చేసిన విలేకరిని జైలుకు కూడా పంపారు అని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img