Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ప్రజలు గుమ్మిగూడే కార్యక్రమాలు ఆపండి : ఉద్ధవ్‌ ఠాక్రే

ముంబై : మహరాష్ట్రలో స్వల్పంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్రంలో ప్రజలు ఒకే చోట గుంపులుగా హాజరయ్యే కార్యక్రమాలను నిలిపివేయాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పండుగలు, ఉత్సవాలు తర్వాత చేసుకుందాం, ప్రజల ప్రణాలకు, ఆరోగ్యానికి ముందు ప్రాధాన్యత ఇద్దామని ఆయన అన్నారు. పెరుగుతున్న కేసులతో పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని, పండగలు, సంప్రదాయ కార్యక్రమాలపై ఆంక్షలు విధించడం ఎవరికీ ఇష్టం లేకపోయినా, ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఉద్ధవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కేరళలో భారీగా కేసులు నమోదవుతున్నాయని, దీన్ని హెచ్కరికగా తీసుకోకపోతే మహరాష్ట్ర భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం మహరాష్ట్రలో 4,057 కరోనా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img