Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

ప్రధాని మోదీని హత్య చేస్తామంటూ ఎన్‌ఐఏకు మెయిల్‌

న్యూదిల్లీ: ప్రధాని నరేంద్రమోదీని హతమారుస్తామని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు ఈ-మెయిల్‌ పంపించాడు. అలాగే దేశవ్యాప్తంగా వేలమందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు మెయిల్‌లో పేర్కొన్నాడు. ఎన్‌ఐఏ ముంబై బ్రాంచ్‌కు ఈ-మెయిల్‌ అందడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రధాని మోదీని హత్య చేసేందుకు 20 మంది స్లీపర్‌ సెల్స్‌ పనిచేస్తున్నారని ఈ-మెయిల్‌లో ఆగంతుకుడు పేర్కొన్నాడు. వారి వద్ద 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ ఉందని తెలిపాడు. దీని ద్వారా దేశవ్యాప్తంగా వేర్వేరు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నామని, వివిధ ఉగ్రవాద గ్రూపులు దీనికోసం పనిచేస్తున్నాయని ఈ-మెయిల్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. తమకు వచ్చిన ఈ-మెయిల్‌ను ఎన్‌ఐఏ వివిధ ఏజెన్సీలతో పంచుకుంది. మరోవైపు ఈ-మెయిల్‌ ఏ ఐపీ అడ్రస్‌ నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్‌ సెక్యూరిటీ విభాగం రంగంలోకి దిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img