Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

ప్రధాని మోదీ నాకు గొప్ప బహుమతి ఇచ్చారు : కేజ్రీవాల్‌

దిల్లీ ఎక్సయిజ్‌ విధానంలో అక్రమాలు జరిగాయంటూ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనీశ్‌ సిసోడియాపై సీబీఐ కేసు నమోదు చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమకు గొప్ప బహుమతి ఇచ్చారని ముఖ్యమంత్రి, ఆ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. దిల్లీ శాసన సభలో విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనీశ్‌ సిసోడియాపై కేసు నమోదు చేయడం వల్ల గుజరాత్‌లో తమ పార్టీకి రెండు శాతం ఓట్లు పెరిగాయని చెప్పారు. సిసోడియాపై సీబీఐ దాడుల తర్వాత గుజరాత్‌లో తమ పార్టీ ఓట్లు నాలుగు శాతం పెరిగాయని కేజ్రీవాల్‌ చెప్పారు. ఆయనను అరెస్టు చేస్తే ఇది 6 శాతానికి పెరుగుతుందన్నారు. ఆయనను రెండుసార్లు అరెస్టు చేస్తే గుజరాత్‌లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆపరేషన్‌ లోటస్‌ విఫలమవుతుందని రుజువు చేయడానికే తాము విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img