Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితా విడుదల.. దిల్లీ ఫస్ట్‌

నివేదిక విడుదల చేసిన హెచ్‌ఈఐ
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరాల జాబితాను హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌ (హెచ్‌ఈఐ) స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో ఢల్లీి అగ్రస్థానంలో నిలవగా కోల్‌కతా ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. హెచ్‌ఈఐ తాజా నివేదికలో ఈ రెండు నగరాలు ఒకటి, రెండు స్థానాలను ఆక్రమించుకున్నాయి. సగటు వార్షిక జనాభా వెయిట్‌ పీఎం 2.5 ఎక్స్‌పోజర్‌ పరంగా దిల్లీ, కోల్‌కతాలను అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో ముంబై 14వ స్థానంలో నిలవగా, టాప్‌-20లో మరే భారత నగరం లేకపోవడం కొంత ఊరటనిచ్చే విషయం. గాలిలో పీఎం 2.5 ఉందంటే మానవులకు తీవ్ర ముప్పు వాటిల్లినట్టే. పీఎం 2.5 కారణంగా ప్రతి లక్ష మందికి 124 మరణాలతో చైనా రాజధాని బీజింగ్‌ అగ్రస్థానంలో ఉండగా, 106 మరణాలతో దిల్లీ ఆరో స్థానంలో ఉంది. 99 మరణాలతో కోల్‌కతా 8వ స్థానంలో నిలిచింది. ఇక, చైనాకు చెందిన ఐదు నగరాలు టాప్‌-20లో ఉండడం గమనార్హం. ఈ అధ్యయనంలో భాగంగా మొత్తం 7 వేల నగరాలను లెక్కలోకి తీసుకున్నారు. అయితే, ఆరు ప్రాంతాల్లోని 103 నగరాలను మాత్రమే ర్యాంకింగ్‌ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఇక, సగటు ఎన్‌ఓ2 ఎక్స్‌పోజర్‌ పరంగా చూసుకుంటే చైనాలోని షాంఘై అత్యంత చెత్త నగరంగా అగ్రస్థానంలో ఉండగా, భారత్‌లోని ఏ నగరం కూడా టాప్‌-20లో లేకపోవడం గమనార్హం. పీఎం 2.5, ఎన్‌ఓ2 విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన నిబంధనలు ప్రపంచంలోని పలు నగరాలు ఎప్పుడో అధిగమించేసి ముప్పును కొని తెచ్చుకున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img