Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ప్రస్తుత భవిష్యత్‌ ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి

సీఐఎల్‌తో బొగ్గు మంత్రి ప్రహ్లాద్‌ జోషి

న్యూదిల్లీ : ప్రస్తుతంతో పాటు తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌)ను బొగ్గు మంత్రి ప్రహ్లాద్‌ జోషి సూచించారు. తాజాగా తీసుకు వచ్చిన ఐటీ పరిజ్ఞానాలు, సుస్థిరత, సమర్థతను పెంచే దృక్పధం ఆధారంగా ఉత్పత్తిని, సరఫరాను పెంచుకుందామన్నారు. ఇటీవల ఎదురైన సవాళ్లను సమర్థంగా అధిగమించినందుకుగాను ఆయన సీఐఎల్‌కు అభినందనలు తెలిపారు. దేశానికి సుస్థిరమైన బొగ్గు సరఫరాకు సంస్థ హామీనిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80శాతం కోల్‌ ఇండియా ఖాతాలో ఉండగా 202122 ఆర్థిక సంవత్సరానికి ఉత్పత్తి లక్ష్యాన్ని 670 మిలియన్‌ టన్నులుగా పెట్టుకుంది. సీఐఎల్‌ ఎంటర్‌ప్రైజ్‌ రీసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ) వ్యవస్థను జోషి ప్రారంభించారు. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. విద్యుత్‌ రంగంలో అంతర్జాతీయంగా సీఐఎల్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడం ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యమన్నారు. ఈఆర్‌పీ వ్యవస్థ సీఐఎల్‌కు ఎంతగానో దోహదం చేస్తుందని మంత్రి జోషి అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img