Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

బీజేపీ ఎమ్మెల్యేల అనర్హతపై త్వరలో మణిపూర్‌ గవర్నర్‌ నిర్ణయం : సుప్రీం

న్యూదిల్లీ : లాభదాయక పదవుల కేసులో మణిపూర్‌లో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన అభిప్రాయంపై మణిపూర్‌ గవర్నర్‌ త్వరలో నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు గురువారం భరోసా ఇచ్చింది. గవర్నర్‌ నిర్ణయంపై సుప్రీం కోర్టు ప్రశ్నించిన పిమ్మట సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతా జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట హాజరై ఈ మేరకు హామీ ఇచ్చారు. ‘జనవరిలో ఎన్నికల సంఘం ఒక అభిప్రాయాన్ని సిఫార్సు చేసింది.. ఆర్టికల్‌ 192 ప్రకారం గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలి. గడిచిన 11 నెలల్లో ఏమీ జరగలేదు. మేము ఆర్డర్‌ ఇవ్వాలనుకోలేదు, కానీ దయచేసి మీ అభిప్రాయాలను తెలియజేయండి’’అని న్యాయమూర్తులు బీఆర్‌ గవాయ్‌, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీనిపై మెహతా స్పందిస్తూ.. ‘మేము ఏదో ఒకటి చేస్తాముజ.. మీరు ఎటువంటి దిశా నిర్దేశం చేయవలసిన అవసరం లేదని నేను హామీ ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన అభిప్రాయాన్ని గవర్నర్‌ తొక్కిపెట్టలేరని కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img