Monday, August 8, 2022
Monday, August 8, 2022

బీపీఎస్‌సీ పేరును లీక్‌ కమిషన్‌గా మార్చండి

ప్రశ్నపత్రాలపై లీక్‌పై ఆర్‌జేడీ నేత తేజస్వి ఆగ్రహం
పాట్నా : బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (బీపీఎస్‌సీ) నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ) పరీక్షల ప్రశ్న పత్రాలు లీకవడంపై ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్‌కి ‘లీక్‌ అయోగ్‌’గా పేరు మార్చడం సముచితమని ప్రతిపక్ష నాయకుడు అన్నారు. రాష్ట్రంలోని నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం తమ పరీక్ష కేంద్రాలకు సుదూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన అభ్యర్థులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ‘బీపీఎస్‌సీ గందరగోళంలో పడిరది అనేది గొప్ప వార్త కాదు. కానీ నిన్నటి సంఘటన తర్వాత ఇంకేమీ మాట్లాడలేదు. లోక్‌ సేవా ఆయోగ్‌ పేరును లీక్‌ ఆయోగ్‌గా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. పరీక్షలను చాలా అరుదుగా సమయానికి నిర్వహిస్తారు. వీటిని నిర్వహించినప్పటికీ, అక్రమాల కారణంగా ఎక్కువ ఆలస్యం జరుగుతుంది’ అని విలేకరులతో అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా బీపీఎస్‌సీ పని తీరును లేవనెత్తినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలు తమ సొంత పట్టణాలకు దూరంగా ఉన్న అభ్యర్థులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దాదాపు మధ్యాహ్నం పరీక్ష ప్రారంభానికి నిమిషాల ముందు ప్రశ్న పత్రాల స్క్రీన్‌ షాట్‌లు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. పరీక్షలను వెంటనే రద్దు చేయనప్పటికీ, ప్రశ్న పత్రం లీక్‌ అయిందని నిర్ధారించిన తర్వాత సాయంత్రం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కమిషన్‌ ప్రకటించింది. కమిషన్‌లోని కొన్ని పెద్ద చేపల సహకారం లేకుండా లీక్‌ జరగలేదని ఆయన ఆరోపించారు. త్వరితగతిన విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img