Saturday, February 4, 2023
Saturday, February 4, 2023

బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం.. చెట్లను నరికేందుకు బాంబే హైకోర్టు అనుమతి

మహారాష్ట్రలో చేపట్టనున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం 22 వేల చెట్లను నరికేందుకు బాంబే హైకోర్టు అనుమతించింది. అయితే షరతులు వర్తిస్తాయని పేర్కొంది. ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం ముంబైతోపాటు పొరుగున ఉన్న పాల్ఘడ్‌, థానే జిల్లాల పరిధిలో విస్తరించిన 50,000కు పైగా మడ చెట్లను నరికివేయడంపై నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ కోరిన అనుమతిని 2018లో కో-ఆర్డినేట్‌ బెంబ్‌ తిరస్కరించింది. ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్‌ అయితే బాంబే హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.ఈ నేపథ్యంలో నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. గతంలో పేర్కొన్న 50 వేలకుపైగా చెట్ల నరికివేతను 22 వేలకు తగ్గించినట్లు తెలిపింది. అలాగే నరికిన చెట్లకు బదులుగా ఐదు రెట్ల మేర మొక్కలు నాటుతామని హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని అనుమతులు పొందినట్లు కోర్టుకు వివరించింది.కాగా, బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం భారీ సంఖ్యలో చెట్లను నరకడంపై ముంబై పర్యావరణ పరిరక్షణకు చెందిన ఎన్జీవో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు చీఫ్‌ జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ అభయ్‌ అహుజాతో కూడిన ధర్మాసనం అన్ని వర్గాల వాదనలు విన్నది. డిసెంబర్‌ 1న రిజర్వ్‌ చేసిన తీర్పును శుక్రవారం వెల్లడిరచింది. బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం సుమారు 22,000 మడ చెట్ల నరికివేతకు అనుమతించింది. అయితే పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ మంజూరు చేసిన అనుమతులలో పేర్కొన్న నిబంధనలు, షరతులకు కట్టుబడాలని నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ను ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img