Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

బెంగళూరు పోలీసుల అదుపులో శ్రద్ధా కపూర్‌ సోదరుడు

బాలీవుడ్‌తో పాటూ తెలుగు ప్రేక్షకులకూ శ్రద్ధాకపూర్‌ బాగా పరిచయమే. ఆమె సోదరుడు సిద్ధాంత్‌ కపూర్‌ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్‌ సేవించిన అతడ్ని పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఎంజీ రోడ్డులో రేవ్‌ పార్టీ జరుగుతున్న హోటల్‌ పై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 35 మంది నుంచి నమూనాలు తీసుకుని ల్యాబ్‌ కు పంపించారు. అందులో సిద్ధార్థ కపూర్‌ సహా ఆరుగురు డ్రగ్స్‌ సేవించినట్టు పరీక్షల్లో తేలింది. డ్రగ్స్‌ సేవించి పార్టీకి వచ్చారా..? లేక హోటల్లో పార్టీకి వచ్చిన తర్వాత డ్రగ్స్‌ సేవించారా? ఎక్కడి నుంచి వీరికి డ్రగ్స్‌ సరఫరా అయ్యాయి? తదితర కోణాల్లో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.‘‘సిద్ధార్థ కపూర్‌ డ్రగ్స్‌ సేవించినట్టు పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. అతడ్ని ఉల్సూర్‌ పోలీసు స్టేషన్‌ కు తరలించాం’’ అని బెంగళూరు ఈస్ట్‌ డివిజన్‌ డీసీపీ భీమశంకర ఎస్‌ గులేద్‌ తెలిపారు. డ్రగ్స్‌ సేవించి అనుమానాస్పద రీతిలో మరణించిన నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో శ్రద్ధాకపూర్‌ను విచారించడం తెలిసిందే. శ్రద్ధా కపూర్‌ సోదరుడే సిద్ధార్థ కపూర్‌. ఈయన కూడా నటుడే. బాలీవుడ్లోని కొన్ని సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించాడు. దాదాపు ఆయన శ్రద్ధా నటించిన సినిమాల్లో కనిపించాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img