బైక్ బుక్ చేసిన ఓ కేరళ యువతిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతిని బైక్ ఎక్కించుకున్న డ్రైవర్ ఆమె చెప్పిన చోటుకు కాకుండా వేరే చోటుకు తీసుకెళ్లాడు. అక్కడ అతని మిత్రుడితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి నుంచి తెల్లవారే వరకు పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేశారు. ఉదయం యువతిని అపస్మారక స్థితిలో చూసిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు షాబుద్దీన్, అక్బర్‌లను అరెస్ట్ చేశారు.బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్ ఎక్కిన సమయంలో యువతి మద్యం మత్తులో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.