Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

భయపడొద్దు.. లాక్‌డౌన్‌ ఉండదు : కేజ్రీవాల్‌

నూదిల్లీ: కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ దిల్లీలో లాక్‌డౌన్‌ విధించబోమని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. మంగళవారం 22వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఎవరూ భయపడొద్దనీ, లాక్‌డౌన్‌ ఉండదన్నారు. దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) సమావేశంలో రాజధాని ప్రాంతమంతా ఆంక్షలు అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను కోరామనీ, వారు అందుకు హామీ ఇచ్చినట్టు కేజ్రీవాల్‌ తెలిపారు. మరోవైపు, దేశ రాజధాని నగరంలో కొవిడ్‌ కట్టడికి ఉన్న అన్ని అవకాశాలనూ అమలు చేస్తున్నారు. ప్రైవేటు కార్యాలయాలను మూసివేసి.. ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీచేశారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తూ దిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ (డీడీఎంఏ) నిర్ణయం తీసుకొంది. అలాగే, రెస్టారెంట్లు, బార్లను సైతం మూసివేసి టేక్‌ అవే, హోం డెలివరీలకు మాత్రమే అనుమతిస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు, దిల్లీలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి ఇప్పటికే వచ్చేసిందనీ.. లేదంటే ఒకట్రెండు రోజుల్లో వస్తుందని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు. ఈ వారంలో మాత్రం రావడం ఖాయమని తెలిపారు. ఆ తర్వాత కేసులు తగ్గడం మొదలవుతుందని పేర్కొన్నారు. కానీ మరోసారి కర్ఫ్యూ విధించే అవకాశం రావొచ్చని పేర్కొన్నారు. దిల్లీలో సోమవారం 19వేలకు పైగా కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img