Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

భారత్‌లో తగ్గిన సంతానోత్పత్తి రేటు

పెరుగుతున్న ఊబకాయం ముప్పు…
జాతీయ ఆరోగ్య సర్వే వెల్లడి

న్యూదిల్లీ : భారతదేశం మొత్తం సంతానోత్పత్తి రేటు తగ్గిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ఐదవ దఫా నివేదిక వెల్లడిరచింది. ఇది జనాభా నియంత్రణ చర్యల గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్‌) జాతీయ స్థాయిలో ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-4, 5 మధ్య సగటున ఒక్కో మహిళ వల్ల కలిగే సగటు సంతానోత్పత్తి రేటు 2.2 నుంచి 2.0కి తగ్గిందని నిర్ధారించింది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ 4, 5వ సర్వే నివేదికల ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు 2.1 కన్నా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయింది. వాటిల్లో బీహార్‌ (2.98), మేఘాలయ (2.91), ఉత్తరప్రదేశ్‌ (2.35), జార్ఖండ్‌ (2.26), మణిపూర్‌ (2.17) రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌`5 సర్వే దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 707 జిల్లాల (మార్చి 2017 నాటికి) నుంచి సుమారు 6.37 లక్షల నమూనా కుటుంబాలలో నిర్వహించారు. 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులు వివరాలు అందించారు. గర్భనిరోధక పద్ధతుల వినియోగం 54 శాతం నుంచి 67 శాతానికి పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. ‘దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆధునిక గర్భనిరోధక పద్ధతుల వాడకం పెరిగింది. కుటుంబ నియంత్రణ అవసరాలు 13 శాతం నుంచి 9 శాతానికి గణనీయంగా తగ్గాయి’ అని తెలిపింది. ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 79 శాతం నుంచి 89 శాతానికి పెరిగినట్లు నివేదిక వివరించింది. గ్రామీణ ప్రదేశాల్లో ప్రసవాలు 87 శాతం, పట్టణాల్లో 94 శాతం ఆస్పత్రుల్లో జరుగుతున్నట్లు తెలిపింది. సంస్థాగత జననాలు అరుణాచల్‌ ప్రదేశ్‌లో గరిష్ఠంగా 27 శాతం పాయింట్లు పెరిగాయి. ఆ తర్వాత అసోం, బీహార్‌, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లలో 10 శాతానికి పైగా పాయింట్లు పెరిగాయి. 91 శాతం జిల్లాల్లో గత 5 సంవత్సరాల్లో 70 శాతం కంటే ఎక్కువ జననాలు ఆరోగ్య సౌకర్యాలలో జరిగాయి. సర్వే ప్రకారం, గత నాలుగేళ్లలో భారతదేశంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో పెరుగుదల స్థాయి 38 నుంచి 36 శాతానికి స్వల్పంగా తగ్గింది. 2019-21లో పట్టణ ప్రాంతాల్లో (30 శాతం) కంటే గ్రామీణ ప్రాంతాల్లోని (37 శాతం) పిల్లల్లో కుంగుబాటు ఎక్కువగా ఉంది. పుదుచ్చేరిలో అత్యల్పంగా (20 శాతం), మేఘాలయలో అత్యధికంగా (47 శాతం) కుంగుబాటులో వైవిధ్యం ఉంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-4 నివేదికతో పోలిస్తే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఊబకాయ కేసులు పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడిరచింది. కేరళ, అండమాన్‌, ఏపీ, గోవా, సిక్కిం, మణిపూర్‌, దిల్లీ, తమిళనాడు, పుదుచ్చేరి, పంజాబ్‌, చండీగఢ్‌, లక్షద్వీప్‌లో మూడవ వంతు మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు.
పెరుగుతున్న ఊబకాయం
చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజల్లో అధిక బరువు, ఊబకాయం పెరిగింది. జాతీయ స్థాయిలో ఇది మహిళల్లో 21 శాతం నుంచి 24 శాతానికి, పురుషులలో 19 శాతం నుంచి 23 శాతానికి పెరిగింది. కేరళ, అండమాన్‌, నికోబార్‌ దీవులు, ఆంధ్రప్రదేశ్‌, గోవా, సిక్కిం, మణిపూర్‌, దిల్లీ, తమిళనాడు, పుదుచ్చేరి, పంజాబ్‌, చండీగఢ్‌, లక్షద్వీప్‌లలో (34-46 శాతం) మహిళల్లో మూడిరట ఒక వంతు మంది అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. అలాగే, 12-23 నెలల వయస్సు గల పిల్లలలో మూడిరట మూడొంతుల మంది (77 శాతం) పూర్తిగా రోగనిరోధక శక్తిని పొందారు. ఆశ్చర్యకరంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎస్‌డీజీ సూచికలు మొత్తంగా మెరుగైనట్లు వెల్లడయింది. వివాహిత స్త్రీలు సాధారణంగా మూడు గృహ నిర్ణయాలలో పాల్గొంటారు (తమ ఆరోగ్య సంరక్షణ, పెద్ద గృహ కొనుగోళ్లు, వారి కుటుంబం లేదా బంధువులను సందర్శించడం) నిర్ణయం తీసుకోవడంలో వారి భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నట్లు సూచించింది. ఇది లడఖ్‌, నాగాలాండ్‌, మిజోరంలో 80 శాతం నుంచి 99 శాతం వరకు ఉంటుంది. గ్రామీణ (77 శాతం), పట్టణ (81 శాతం) తేడాలు అంతంత మాత్రమే.
మహిళల బ్యాంకు ఖాతాలు పెరుగుదల
బ్యాంకు లేదా పొదుపు ఖాతాలను కలిగి ఉన్న మహిళల ప్రాబల్యం గత నాలుగు సంవత్సరాలలో 53 శాతం నుంచి 79 శాతానికి పెరిగింది. అలాగే, శుభ్రమైన వంట ఇంధనం వాడకంలో పెరుగుదల (44 శాతం నుండి 59 శాతం), మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు (49 శాతం నుంచి 70 శాతం), సబ్బు, నీటితో చేతులు కడుక్కోవడం (60 శాతం నుంచి 78 శాతం) గణనీయంగా మెరుగుపడినట్లు సర్వే తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img