Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

భారత్‌ బయోటెక్‌ కోవిడ్‌ ముక్కు వ్యాక్సిన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌..

భారత్‌ బయోటెక్‌ సంస్థ రూపొందించిన నాసల్‌ కోవిడ్‌ టీకాకు కేంద్ర ప్రభుత్వ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీగా వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇంట్రానాసల్‌ కోవిడ్‌19 టీకాకు డీసీజీఐ అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ మన్సూక్‌ మాండవీయ తెలిపారు. ఇండియాలో ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్‌ టీకాకు అనుమతి దక్కడం ఇదే తొలిసారి. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ టీకా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img