భారీవర్షాలు, దట్టమైన పొగమంచు కారణంగా ఇవాళ 478 రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. దిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే 478 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే అధికారులు వెల్లడిరచారు. జనవరి 24వతేదీన పొగమంచు, భారీవర్షాల వల్ల దేశంలో 542 రైళ్లను రద్దు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల దిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే రైళ్లను రద్దు చేశామని అధికారులు తెలిపారు. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్‌లో అధికారికంగా రద్దు చేసిన రైళ్ల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది.వాతావరణం అనుకూలించక పోవడంతో దిల్లీ, జమాల్ పూర్ జంక్షన్,కాన్పూర్ సెంట్రల్- రాయబరేలీ, మొరాదాబాద్, లక్నో తదితర రైలు మార్గాల్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.