Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

భోపాల్‌లో ఏడాదిలో 107 డెంగీ కేసుల నమోదు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ జిల్లాలో 24 గంటల వ్యవధిలో ఆరుగురు డెంగీ భారిన పడగా, ఈ ఏడాదిలో మొత్తంగా 107 డెంగీ కేసులు నమోదయ్యాయని శనివారం ఆ జిల్లా ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. అయితే డెంగీ కారణంగా ఈ ఏడాది ఎటువంటి మరణాలు నమోదుకాలేదని, ఎక్కువగా భోపాల్‌ నగరంలోనే డెంగీ కేసులు బయటపడ్డాయని జిల్లా మలేరియా అధికారి డా.అఖిలేష్‌ దూబే పేర్కొన్నారు. నగరంలోని 85 వార్డులు ఉండగా 10 వార్డుల్లో 85 శాతం డెంగీ కేసులు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో పర్యటించేందుకు 39 బృందాలను ఏర్పాటు చేశామని, ఈ బృందాల్లో ఇద్దరు నుంచి ముగ్గురు వైద్యులు ఉంటారని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ డెంగీ కేసులు కనిపిస్తున్నాయని, ప్రజలు వైరల్‌ జ్వరలపై జాగ్రత్త వహించాలని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img