Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

మంకీపాక్స్‌ చికిత్సకు వాడే ఔషధం క్లినికల్‌ ట్రయల్‌ మొదలు

ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మంకీపాక్స్‌ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌ని నయం చేసేందుకు వాడే మందును పరీక్షించడానికి ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో క్లినికల్‌ ట్రయల్‌ ప్రారంభమైంది. ప్రస్తుతానికి ‘టెకోవిరిమాట్‌’ అనే డ్రగ్‌ మంకీ పాక్స్‌ పై పోరాడుతుందని భావిస్తున్నారు. టెకోవిరిమాట్‌ను ప్రారంభంలో మశూచిని నయం చేసేందుకు అభివృద్ధి చేశారు. ఇది వైరస్‌ కు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు శరీరంలో దాని వ్యాప్తిని ఆపుతుంది. జంతువులపై ప్రాథమిక అధ్యయనాలు మంచి ఫలితాలను చూపించిన తర్వాత మంకీపాక్స్‌ కోసం దీన్ని వినియోగించేందుకు ఔషధాలు మరియు ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ నుంచి దీనికి లైసెన్స్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో మనుషులపై ప్రయోగించేందుకు ఆక్సఫర్డ్‌లో పరీక్షలు మొదలయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ సర్‌ పీటర్‌ హోర్బీ నాయకత్వంలో జరిగే ఈ ప్రయోగానికి ‘ప్లాటినం’ అని నామకరణం చేశారు. దీని కోసం బ్రిటన్‌ ప్రభుత్వం 3.7-మిలియన్‌ పౌండ్ల నిధులు మంజూరు చేసింది. ఈ డ్రగ్‌ ను కనీసం 500 మంది వాలంటీర్లపై ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 14 రోజుల కోర్సులో వారికి రోజుకు రెండుసార్లు 600 ఎంజీ టెకోవిరిమాట్‌ ఇస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img