Monday, January 30, 2023
Monday, January 30, 2023

మణిపూర్‌లో తొలివిడత ఎన్నికల పోలింగ్‌

మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మణిపూర్‌ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. మొదటి విడుతలో భాగంగా ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 38 స్థానాల్లో మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో మహిళలు 15 మంది మాత్రమే ఉండటం గమనార్హం.తొలివిడతతో 1,721 పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. సీఎం బీరేన్‌ సింగ్‌, ఉపముఖ్యమంతి కూడా తొలివిడత బరిలో నిలిచారు. కాగా, మణిపూర్‌లో తొలివిడుత ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగాల్సి ఉన్నది. అయితే ఎన్నికల ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో నేటికి వాయిదావేశారు. మార్చి 5న మరో 22 స్థానాలకు రెండో విడుత పోలింగ్‌ జరుగనుంది. అదేనెల 10న ఫలితాలు వెలువడనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img