Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

మద్యపాన నిషేధంపై పిటిషన్‌ విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలోకి రాదంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ మేరకు తమ ముందుకు వచ్చిన పిటిషన్‌ను సోమావరం జస్టిస్‌ లలిత్‌ బెంచ్‌ కొట్టేసింది. జాతీయ స్థాయిలో మద్యపాన నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఇటీవలే ఓ పిటిషన్‌ దాఖలైంది. దేశవ్యాప్తంగా మద్యపాన నిషేధంపై విధానం రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని సదరు పిటిషన్‌ను దాఖలు చేసిన వ్యక్తి కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ సోమవారం జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం ముందుకు రాగా… ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదన్న జస్టిస్‌ లలిత్‌… పిటిషన్‌ను కొట్టివేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img