London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం..

ఇటీవ‌ల కాలంలో భూకంపాలు ఎక్కువ‌గా చోటుచేసుకుంటున్నాయి. ట‌ర్కీ, సిరియాలో వ‌చ్చిన భారీ భూకంపం గురించి తెలిసిందే. అయితే తాజాగాౌ మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం (జుaత్‌ీష్ట్రనబaసవ) వచ్చింది. ఈరోజు ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. గ్వాలియర్‌కు 28 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో కూడా భూమి కంపించింది. అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో భూకంపం వచ్చిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. అంబికాపూర్‌లో ఆరు సెకన్ల పాటు భూమి కంపించిందని వెల్లడించింది. దీని ప్రభావంతో ప్రజలు ఇళ్ల‌ నుంచి బయటకు పరుగులు తీశారని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img