Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

మమత మేనల్లుడికి మరోసారి ఈడీ సమన్లు

కోల్‌కతా : బెంగాల్‌ బొగ్గు కుంభకోణంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. సెప్టెంబరు 21న విచారణకు హాజరు కావాలని సమన్లలో ఆదేశించింది. వాస్తవానికి శుక్రవారమే దిల్లీలోని ఈడీ కార్యాలయంలో అభిషేక్‌ బెనర్జీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, విచారణకు హాజరుకావాలంటూ తనకు అతి తక్కువ సమయాన్ని ఇచ్చారని, అందువల్ల హాజరు కాలేనని ఈడీకి ఆయన తెలిపారు. దీంతో సెప్టెంబర్‌ 21న విచారణకు రావాలని తాజాగా సమన్లలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img