Monday, January 30, 2023
Monday, January 30, 2023

మరీ అంత ముచ్చట ఉంటే..పాక్‌లోనే సెటిలవ్వండి : ప్లహ్లాద్‌ జోషి

మీకు పాక్‌ పట్ల మరీ అంత ముచ్చట ఉంటే అక్కడకు వెళ్లి స్థిరపడొచ్చని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లాకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి సలహా ఇచ్చారు. శ్రీనగర్‌లో సోమవారంనాడు జరిగిన ఉగ్రదాడిలో మృతిచెందిన ఇద్దరు పోలీసులకు ఫరూక్‌ అబ్దుల్లా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కశ్మీర్‌లో శాంతి నెలకొనేందుకు పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.ఇరుదేశాలు ‘ఇగో’లను పక్కనబెట్టి చర్చలకు ముందుకు రావాలన్నారు. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదానికి తెరపడేలా చేసి జమ్మూకశ్మీర్‌ ప్రజల మనసులు గెలుచుకోవాలని కేంద్రానికి ఆయన సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img