Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

మలుపు తిరిగిన సోనాలీ ఫోగాట్‌ హత్య కేసు.. వెలుగులోకి కొత్త కోణం!

టిక్‌టాక్‌ స్టార్‌, హరియాణా బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగట్‌ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత ఆమె గుండెపోటుతో చనిపోయిందని ప్రచారం జరగ్గా.. పోస్ట్‌మార్టం నివేదికతో అసలు విషయం బయటపడిరది. సోనాలీది హత్యేనని తేలింది. తాజాగా, ఈ కేసులో మరో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్‌ సెక్టారు 102లో గ్రీన్స్‌ ప్రాంతంలో కృష్ణకాంత్‌ తివారీ ఫ్లాటులో సోనాలీ అద్దెకు ఉండేవారు. అయితే, ఈ ఫ్లాట్‌ అద్దెకు సంబంధించిన అగ్రిమెంట్‌లో ఆమె వ్యక్తిగత సహాయకుడు సుధీర్‌ సాంగ్వాన్‌ సోనాలీ ఫోగాట్‌ తన భార్య అని పేర్కొన్న విషయం బయటకు వచ్చింది.ఈ ఫ్లాట్‌ను సోనాలీ అద్దెకు తీసుకున్నప్పుడు పోలీసులు వెరిఫికేషన్‌ కూడా పూర్తిచేశారు. మరోవైపు, గోవాకు బయలుదేరే ముందు తన సహాయకుడితో కలిసి గురుగ్రామ్‌లోని తన ఫ్లాట్‌కి వెళ్లిన సోనాలీ.. అక్కడి నుంచి విమానాశ్రయానికి క్యాబ్‌లో వెళ్లినట్టు పోలీసు వర్గాలు వెల్లడిరచాయి. ఫోగట్‌ శరీరంపై పలు గాయాలున్నట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. గోవా అంజునా బీచ్‌ సమీపంలోని కర్లీస్‌ రెస్టారెంట్‌లో పార్టీ సందర్భంగా సోనాలి ఫోగాట్‌ 1.5 గ్రాముల ఎండీఎంఏ కలిపిన పానీయం తీసుకున్నట్టు వెల్లడయ్యింది.ఆ పానీయం సేవించడంతో నియంత్రణ కోల్పోయిన సోనాలీ ఫోగట్‌ను నిందితుడు టాయిలెట్‌కి తీసుకెళ్లి రెండు గంటల పాటు లోపల ఉంచాడని, ఆ సమయంలో ఏం చేశాడనే అంశంపై గోవా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫోరెన్సిక్‌ నిపుణులు సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. పానీయం తాగిన తర్వాత సోనాలీ కుంటుతున్నట్లు ఉన్న సీసీటీవీ ఫుటేజీ పోలీసులకు లభ్యమయ్యింది. పబ్‌లోకి కుంటూకుంటూ సోనాలీ వెళుతుండగా, పక్కన సుధీర్‌ సాంగ్వాన్‌ తీసుకెళ్తుండటం కనిపించింది. నిందితులు సుధీర్‌ సాంగ్వాన్‌, సుఖ్వీందర్‌లు కెమేరా కంటికి చిక్కడంతో వారిని అరెస్ట్‌ చేసి విచారణ వేగవంతం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img