Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 19,893 పాజిటివ్‌ కేసులు
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోనే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కానీ కరోనా కేసులు మరోసారి పెరిగిపోయాయి. బుధవారం 17,135 కేసులు నమోదవగా, కొత్తగా 19,893 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,87,037కు పెరిగింది. ఇందులో 4,34,24,029 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,530 మంది మృతిచెందారు. మరో 1,36,478 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 53 మంది కరోనాకు బలవగా, 20,419 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.3 శాతానికి చేరిందని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నది. రికవరీ రేటు 98.50 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని వెల్లడిరచింది. ఇప్పటివరకు 205.22 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img