Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

మహారాష్ట్ర మంత్రి వర్షా గైక్వాడ్‌కు కరోనా

మహారాష్ట్రకు చెందిన పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వల్పంగా జ్వరం రావడంతో ఆమె సోమవారం సాయంత్రం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ‘‘నాకు తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించాయి. నేను బాగానే ఉన్నాను, నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అని వర్షా గైక్వాడ్‌ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా వెల్లడిరచారు. సోమవారం రాష్ట్ర శాసనమండలిలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన పలు ప్రశ్నలకు మంత్రి వర్షా గైక్వాడ్‌ సమాధానమిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img