Monday, August 8, 2022
Monday, August 8, 2022

మహారాష్ట్ర సీఎంకు కోవిడ్‌ పాజిటివ్‌

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో వైపు ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. శివసేనకు చెందిన మంత్రి ఏక్‌నాథ్‌ షిండే సుమారు 40 మంది ఎమ్మెల్యేలతో అస్సాం వెళ్లారు. దీంతో ఉద్దవ్‌ నేతృత్వంలోని మహా వికాశ్‌ అవధి కూటమి మైనార్టీలో పడిరది. అయితే సంక్షోభంపై ఉద్దవ్‌తో చర్చించేందుకు కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ ప్రయత్నించారు. కానీ ఆ చర్ఛలు జరగలేదు. ఉద్దవ్‌ కోవిడ్‌ పాజిటివ్‌ అని, దాని వల్లే ఆయన్ను కలవలేకపోయినట్లు కమల్‌నాథ్‌ తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశియారికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. రిలయన్స్‌ ట్రస్ట్‌ హాస్పిటల్‌లో ఆయన చేరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img