Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

మా అభ్యర్థిని బీజేపీ కిడ్నాప్‌ చేసింది : ఆమ్‌ ఆద్మీ

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన తమ అభ్యర్థి కంచన్‌ జరీవాలా మంగళవారం నుంచి కనిపించడంలేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలిపింది. కంచన్‌ జరీవాలాను బీజేపీ కిడ్నాప్‌ చేసినట్లు ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా ఆరోపించారు. సూరత్‌ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి కంచన్‌ జరీవాలా ఆప్‌ తరపున పోటీ చేయనున్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ తమ అభ్యర్థులను ఎత్తుకెళ్లుతున్నట్లు ఆయన ఆరోపించారు. నిన్నటి నుంచి కంచన్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు మిస్సింగ్‌లో ఉన్నారన్నారు. నామినేషన్‌ పేపర్లు దాఖలు చేసేందుకు ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కంచన్‌ను బీజేపీ గుండాలు ఎత్తుకెళ్లినట్లు డిప్యూటీ సీఎం సిసోడియా ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img