Monday, September 26, 2022
Monday, September 26, 2022

మా ఇంట్లో ఎంతకాలమైనా ఉండొచ్చు..ఈడీ, సీబీఐలపై తేజస్వీ యాదవ్‌ సెటైర్లు

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో తనిఖీలు సాగుతున్నాయ. ఈ క్రమంలో కొంతమంది ఇళ్లలో నోట్ల కట్టలు దర్శనమిస్తున్నాయి. అయితే దీనిపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. కేంద్రం.. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని కావాలనే ఇలా చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ ప్రసాద్‌ యాదవ్‌.. దర్యాప్తు సంస్థలపై విమర్శలు గుప్పించారు. తనదైన శైలీలో వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ,సెంటర్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌లు తన ఇంట్లోనే కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఆ సంస్థలు నిరభ్యంతరంగా తమ ఇంటికి వచ్చి ఉండొచ్చన్నారు. ‘‘నేను మీ ఛానెల్‌ ద్వారా ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీరు కోరుకున్నంత కాలం వచ్చి ఉండండి. మాపై దాడి చేయడానికి వెళ్లి రెండు నెలల తర్వాత ఎందుకు రావడం..? ఇక్కడే ఉండండి.. ఇది సులభం’’ అని ఆయన అన్నారు. అంతేకాదు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు బీజేపీ పార్టీ సెల్‌ లాగా పని పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాగా డిప్యూటీ సీఎంగా తేజస్వీ యాదవ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా దర్యాప్తు సంస్థల గురించి తాను భయపడేది లేదన్నారు. బీహార్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడతామన్నారు. అలాగే 2024లో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రధానమంత్రి పదవికి కరెక్ట్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img