Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

ముందు ఆరెస్సెస్‌ను నిషేధించాలి : లాలు ప్రసాద్‌ యాదవ్‌

విద్వేషాలను రెచ్చగొట్టే అన్ని సంస్థలను నిషేధించాలన్న లాలూ
ఆరెస్సెస్‌ అనేది ఒక అతివాద హిందూ సంస్థ అని వ్యాఖ్య
గతంలో పటేల్‌ ఆరెస్సెస్‌ ను నిషేధించారన్న లాలూ

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మండిపడ్డారు. పీఎఫ్‌ఐపై నిషేధం విధించిన మాదిరే… విద్వేషాలను రెచ్చగొడుతున్న అన్ని సంస్థలపై నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ముందు ఆరెస్సెస్‌ను నిషేధించాలని ఆయన అన్నారు. ఆరెస్సెస్‌ ను సర్దార్‌ పటేల్‌ నిషేధించిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఆరెస్సెస్‌ అనేది ఒక అతివాద హిందూ సంస్థ అని, దీన్ని బ్యాన్‌ చేయాల్సిందేనని అన్నారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్‌ చేశారు. మరోవైపు. పీఎఫ్‌ఐపై నిషేధం విధించడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img