న్యూదిల్లీ : భారత్‌లో కొవిడ్ మరణాలు 90 రోజుల కనిష్టానికి చేరుకోగా 111 రోజుల కనిష్టానికి పాజిటివ్ కేసులు చేరాయి. వరుసగా రెండవ రోజు 40వేల లోపు కొత్త ఇన్ఫెక్షన్లు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 553 మరణాలు, 34,703 కొత్త కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం నివేదిక ఇచ్చింది. మొత్తం కేసుల సంఖ్య 3,06,19,932కి, మరణాలు 4,03,281కి చేరుకున్నాయి. క్రియాశాల కేసుల సంఖ్య 101 రోజుల తర్వాత కనిష్టంగా 4,64,357కి చేరింది. మొత్తం కేసుల్లో ఇది 1.52శాతంగా ఉంది. దేశంలో రికవరీ రేటు 97.17శాతానికి పెరిగింది. ఇప్పటివరకు 2,97,52,294 మంది కోలుకున్నారు. వరుసగా 54వ రోజు పాజిటివ్‌ల కంటే రివకరీలు ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కొత్తగా సంభవించిన 553 మరణాల్లో 106 మహారాష్ట్రలో, 102 కేరళలో 67 కర్ణాటకలో నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక తెలిపింది.వాక్సినేషన్ జోరు : 35.75 కోట్ల మందికి టీకా
కొవిడ్ కట్టడి లక్ష్యంగా వాక్సినేషన్ జోరుగా సాగుతోంది. 24 గంటల్లో 45 లక్షలకుపైగా డోసులు వినియోగం కాగా 35.75కోట్ల మంది వాక్సినేషన్ పూర్తి అయింది. 1844 ఏళ్లవారికి 10.57కోట్లకుపైగా టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వాక్సినేషన్ 171వ రోజున మొత్తం 45,82,246 డోసుల పంపిణీ జరుగగా 27,88,440 మంది మొదటి టీకా, 17,93,806 మంది రెండవ టీకా తీసుకున్నట్లు పేర్కొంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, బీహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రతో కలిపి ఎనిమిది రాష్ట్రాల్లో 18
44 ఏళ్ల వారికి మొదటి డోసు 50లక్షల టీకాలు ఇవ్వబడినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.