Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

మోదీపై రాహుల్‌ ఫైర్‌

న్యూదిల్లీ: నిరుద్యోగం, అధిక ధరలు, సామాజిక అస్థిత్వంలాంటివి దేశం ముందు ఉన్న కీలకమైన సవాళ్లని, ఈ కారణంగా దేశంలోని యువత తీవ్ర నిస్తోజంగా ఉన్నారని, కానీ వీటి గురించి ప్రధాన నరేంద్ర మోదీ ఏమీ మాట్లాడటం లేదని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ గురువారం మోదీపై విరుచుకుపడ్డారు. ఈ విషయంపైనే రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై విమర్శలు చేస్తూ, వీటికి తక్షణమే సమాధానం చెప్పేలా ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలను అభ్యర్థించారు. ‘నిరుద్యోగం, చొరబాటు, సామాజిక అస్థిరత్వంలాంటివి దేశం ముందు ప్రస్తుతం ఉన్న సవాళ్లు. ఈ కారణంగా యువతలో నిసత్తువ, కోపం పెరిగిపోతోంది. ఇది ఇంకా పెద్ద సమస్య. వీటికి పరిష్కారం చెప్పకుండా, ప్రధాన ఏమీ మాట్లాడకపోవడం విడ్డూరం’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img