Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

మోదీ ఎవరిపై ప్రేమ చూపుతున్నారో తెలిసిపోతోంది…: రాహుల్‌గాంధీ

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. పలు రకాల ఆహార పదార్థాలు, ధాన్యాలపై 5 శాతం జీఎస్టీ విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టారు. డబ్బున్న వారికి అనుకూలంగానే బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. జీఎస్టీని గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ అంటూ మరోసారి మండిపడ్డారు. పలు సేవలు, ఉత్పత్తులపై జీఎస్టీని పోలుస్తూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.
‘‘హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (ఆరోగ్య బీమా)పై 18 శాతం జీఎస్టీ, ఆస్పత్రుల్లో గదులపై 5 శాతం జీఎస్టీ.. అదే వజ్రాలపై మాత్రం 1.5 శాతమే జీఎస్టీ.. ప్రధాన మంత్రి ఎవరి పట్ల శ్రద్ధ చూపుతారనే బాధాకరమైన విషయానికి గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) చిహ్నం. తక్కువ రేటుతో ఉండే ఒకే శ్లాబ్‌ జీఎస్టీతో అత్యవసరమైన, నిత్యావసరాల ధరలు నియంత్రణలోకి వస్తాయి. పేదలు, మధ్య తరగతి ప్రజలపై భారం తగ్గుతుంది. అదే సమయంలో ప్రభుత్వాలు తమకు ఇష్టమొచ్చినట్టుగా పన్నులు పెంచడం ఆగిపోతుంది..’’ అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img