Friday, March 31, 2023
Friday, March 31, 2023

యూపీలో ‘కొత్త తరంగం’

కనుమరుగైన రాజకీయ దిగ్గజాలు
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వారసుల రంగ ప్రవేశం
ఆసక్తిదాయకంగా మారిన పోరు
వారికి ఆదరణ ఎంతనేది ప్రశ్నార్థకం

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కొత్త దృశ్యం కనిపించనుంది. అనేక మంది రాజకీయ దిగ్గజాలు కనుమరుగవడంతో వారి బలీయమైన ఉనికి లేకుండా వారి పిల్లలు ఈసారి ఎన్నికల్లో ఎలా ముందుంటారనేది ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌, రాష్ట్రీయ లోక్‌దళ్‌ నేత అజిత్‌ సింగ్‌, బీజేపీ నాయకుడు లాల్జీ టాండన్‌, అలాగే సమాజ్‌వాది పార్టీ నాయకులు అమర్‌ సింగ్‌, బేణి ప్రసాద్‌ వర్మ వంటి వారందరూ అనేక దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసించారు. కానీ అధిక శాతం అసెంబ్లీకి హాజరు కాలేదు. రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీరంతా గత రెండేళ్లలో చనిపోయారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ కూడా అనారోగ్యం కారణంగా ఎన్నికల రాజకీయాల హడావుడి నుంచి చాలా వరకు దూరంగా ఉన్నారు. చాలా అరుదుగా బహిరంగంగా కనిపిస్తారు. ‘ఈ ప్రముఖుల చర్యలు, మాటలకు రాజకీయ అర్థం ఉంది. వారు వ్యూహాన్ని రూపొందించడాన్ని ప్రత్యర్థులు ఆసక్తిగా చూశారు. కానీ ఈసారి ఈ దిగ్గజాలు ఎన్నికల పోరులో భౌతికంగా ఉండరు. ఉత్తరప్రదేశ్‌లోని ఓటర్లకు వారికి ఓటు వేసే అవకాశం లేదు. ఇప్పుడు వారు లేనప్పుడు తమను తాము నిరూపించుకోవాల్సిన తరానికి ఇది అవసరం’ అని రాజకీయ విశ్లేషకుడు జె.పి.శుక్లా అన్నారు. ఈ కొత్త తరం నాయకులు ప్రజలు, వర్గాల విషయంలో ఊగిసలాడవచ్చు. రాజకీయ సమీకరణలను పునర్వ్యస్థీకరించవచ్చు. ఆగస్టు 21, 2021న మరణించిన బీజేపీ నాయకుడు, హిందూత్వ వాది కల్యాణ్‌ సింగ్‌, రాష్ట్రంలో తన పార్టీకి యాదవేతర ఓబీసీ కులాలను ఏకం చేయగలిగాడు. ఆయన పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో మంచి ఉనికిని, ఆదరణను కలిగి ఉన్నాడు. ఆయన ఆశీర్వాదంతో మనుమడు సందీప్‌ సింగ్‌ 2017లో గత అసెంబ్లీ ఎన్నికల్లో అలీఘర్‌ జిల్లాలోని అత్రౌలీ స్థానం నుంచి విజయం సాధించేలా చేశాయి. కల్యాణ్‌ సింగ్‌ కుమారుడు రాజ్‌వీర్‌ సింగ్‌ ఎటా స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత, దానికి నైతిక బాధ్యతతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం కల్యాణ్‌ సింగ్‌ జీవితంలోని నిర్ణయాత్మక క్షణం. ఆయన మరణం బీజేపీకి తీరని లోటు. ‘పార్టీలోని అత్యంత సీనియర్‌ నాయకుల్లో కల్యాణ్‌జీ ఒకరు. సహజంగానే ఆయన గైర్హాజరీ ఎన్నికలలో కనిపిస్తుంది. కానీ పార్టీ అతని కుటుంబంతో ఉంది. ఇప్పటికే ఆయన మనుమడు సందీప్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అతని విజయం ఖాయం’ అని బీజేపీ అధికార ప్రతినిధి చెప్పారు. ఇదిలాఉండగా మే 6, 2020న మరణించిన తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి అజిత్‌ సింగ్‌ లేకుండా రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ)లో జయంత్‌ చౌదరి తన పార్టీకి నాయకత్వం వహిస్తున్న మొదటి ఎన్నిక ఇది. అజిత్‌ సింగ్‌ 2014, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటమిని రుచి చూసినప్పటికీ, రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోని జాట్‌లపై అతని పట్టును ప్రత్యర్థులు కూడా మెచ్చుకున్నారు. ‘పశ్చిమ యూపీ ప్రజలకు అజిత్‌సింగ్‌పై గౌరవం ఉంది. ఈసారి వారు జయంత్‌ చౌదరి నాయకత్వానికి మద్దతు పలకడం ద్వారా అజిత్‌ సింగ్‌కు నివాళులు అర్పించి, తదుపరి ప్రభుత్వం సమాజ్‌వాది పార్టీతో ఏర్పడేలా చూస్తారు. ఈ ప్రాంతంలో ఆర్‌ఎల్‌డీకి ఆదరణ ఉంది’ అని ఆర్‌ఎల్‌డీ జాతీయ కార్యదర్శి అనిల్‌ దూబే చెప్పారు. ఆర్‌ఎల్‌డీ ఈసారి సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. మరోవైపు, బీహార్‌ మాజీ గవర్నర్‌ లాల్జీ టాండన్‌, ఒకప్పుడు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి సన్నిహితుడు. లక్నోలో బీజేపీ ప్రముఖ ముఖంగా పరిగణించబడ్డాడు. ఆయన జులై 21, 2020న మరణించారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు అశుతోష్‌ టాండన్‌, లాల్జీ లేనప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది. సమాజ్‌వాది పార్టీలో లాఠీ ఇప్పుడు ములాయం సింగ్‌ యాదవ్‌ తనయుడు అఖిలేష్‌ యాదవ్‌కు చేరింది. ఆరోగ్య సమస్యల కారణంగా ములాయం సింగ్‌ యాదవ్‌ రాజకీయ ఉనికి అంతంతమాత్రంగానే ఉంది. ‘నేతాజీ (ములాయం) మమ్మల్ని కలవడానికి తరచుగా పార్టీ ఆఫీసుకు వస్తారు. మాకు మార్గనిర్దేశం చేస్తారు. ఆయన శిక్షణ, మార్గదర్శకత్వంతో పార్టీ అఖిలేష్‌ నేతృత్వంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది’ అని ఎస్‌పీ ఎమ్మెల్సీ రాజ్‌పాల్‌ కశ్యప్‌ అన్నారు. పార్టీ ప్రముఖ నాయకులు అమర్‌ సింగ్‌, బేణి ప్రసాద్‌ వర్మను కూడా కోల్పోయింది. అమర్‌ సింగ్‌ ఆగస్టు 1, 2020న మరణించగా, వర్మ అదే సంవత్సరం మార్చి 27న కన్నుమూశారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ తీవ్ర ఆధిపత్య పోరును ఎదుర్కొన్నప్పుడు అమర్‌ సింగ్‌ అఖిలేష్‌ యాదవ్‌ మామ శివపాల్‌ యాదవ్‌కు అండగా నిలిచారు. ఆ పోరాటం ఎన్నికల సంఘం వరకు వెళ్లింది. అంతిమంగా, అఖిలేష్‌ యాదవ్‌ యుద్ధం చేసి మరీ పార్టీ గుర్తును గెలుచుకున్నారు. బేణి ప్రసాద్‌ వర్మ 2009లో సమాజ్‌వాది పార్టీని వీడి 2016లో మళ్లీ ఎస్‌పీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు రాకేష్‌ వర్మ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బారాబంకి నియోజకవర్గం నుంచి ఎస్‌పీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. రాయ్‌బరేలీకి చెందిన మరో ప్రముఖ నాయకుడు అఖిలేష్‌ సింగ్‌ ఆగస్టు 20, 2019న మరణించారు. ఆయన లేకపోవడంతో కూతురు ఆదితి సింగ్‌ తన రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆదితి సింగ్‌ ప్రస్తుతం అసెంబ్లీకి రాయ్‌బరేలీ సదర్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన అఖిలేష్‌ సింగ్‌ ‘రాబిన్‌ హుడ్‌ ఆఫ్‌ రాయ్‌ బరేలీ’గా ప్రసిద్ధి పొందాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img