Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

యూపీలో చివరి విడత ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరి విడత పోలింగ్‌ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. 9 జిల్లాల్లోని 54 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ సాగుతోంది. చందౌలీ, ఘాజీపూర్‌, మౌ, అజంగఢ్‌, మీర్జాపూర్‌, భదోహి, జౌన్‌పూర్‌, సోన్‌భద్ర, వారణాసి జిల్లాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. 54 సీట్లలో మొత్తం 613 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 2.6 కోట్ల మంది ఓటర్లు వారీ భవితవ్యం తేల్చనున్నారు.ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కూడా ఈ విడుతలోనే పోలింగ్‌ జరుగుతున్నది. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 36 స్థానాల్లో విజయం సాధించగా, ఎస్పీ 11, బీఎస్పీ 6 చొప్పున గెలుపొందాయి. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img