జైపూర్: రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వడగాడ్పులు సైతం తీవ్రమయ్యాయి. ప్రజలు అల్లాడుతున్నారు. బార్మర్ ప్రాంతంలో అత్యధికంగా 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు ఉష్ణోగ్రతలు నమోదు చేశారు. ఫలోడీలో 42.8, దుంగార్పూర్, బన్‌స్వరలో 42.7 డిగ్రీలు, జైసల్మీర్‌లో 42.2 డిగ్రీలు, చురులో 41.8, జలోర్‌లో 41.7, సిరోహి, జోధ్‌పూర్‌లలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడిరచింది.