Monday, March 20, 2023
Monday, March 20, 2023

రాజ్యసభలో ట్రిపులార్‌పై ప్రశంసల జల్లు.. నాటు నాటు అనగానే దద్దరిల్లిన సభ

విశ్వ వేదికపై తెలుగు సినిమాను నిలబెట్టిన ట్రిపులార్‌ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగు వారితో పాటు దేశ ప్రజలంతా సాహో రాజమౌళి అంటున్నారు. నాటు నాటు పాట పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడం దేశ ప్రజల విజయంగా భావిస్తున్నారు. బెస్ట్‌ ఒరిజినల్ క్యాటగిరీలో ఆస్కార్‌ అవార్డు అందుకున్న నాటు నాటు సాంగ్‌తో ఆస్కార్‌ వేదిక దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దేశ గర్వాన్ని విశ్వవేదికపై నిలబెట్టిన ట్రిపులార్‌ చిత్ర బృందానికి సినీ పరిశ్రమ మొదలు రాజకీయ నాయకుల వరకు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా పార్లమెంట్ సమావేశాల్లోనూ ట్రిపులార్‌ చిత్రానికి గౌరవం దక్కింది. ఆస్కార్‌ వేదిక చరిత్ర సృష్టించిన మన తెలుగు సినిమా ట్రిపులార్‌ గురించి రాజ్యసభలోనూ ప్రశంసలు వెల్లువెత్తాయి. రాజ్యసభ చైర్మన్‌ జగ్దీప్ ధన్‌ఖర్ ట్రిపులార్‌ చిత్ర యూనిట్‌ను అభినందించారు.. ఆయన నాటు నాటు అంటూ మొదలు పెట్టగానే సభలో ఉన్న సభ్యుల చప్పట్లతో సభ ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా అవార్డు గెలుచుకున్నది ఎలిఫెంట్ విస్పరర్స్ టీమ్‌కు కూడా రాజ్యసభ చైర్మన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయాలు భారతీయ కళాకారుల అపారమైన ప్రతిభ, అపారమైన సృజనాత్మకత అంకితభావాని తెలియజేస్తాయన్నారు. నిజానికి ఇది మన గ్లోబల్‌ గుర్తింపు అంటూ ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img