Monday, August 8, 2022
Monday, August 8, 2022

రాళ్లు రువ్వినందుకు వారికి బీజేపీ డబ్బు పంచుతోంది : దిగ్విజయ్‌ సింగ్‌

పేద ముస్లిం యువకులకు రాళ్లు రువ్వినందుకు బీజేపీ డబ్బు ఇస్తోందని తనకు అనధికార సమాచారం అందిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. రామనవమి, హనుమాన్‌ జయంతి సందర్భంగా రాజస్దాన్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ సహా పలు రాష్ట్రాల్లో మత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో దిగ్విజయ్‌ సింగ్‌ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా దిగ్విజయ్‌ సింగ్‌ ఇటీవల సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌ దుమారం రేగింది. తాజాగా ఇక కాషాయ పార్టీని టార్గెట్‌ చేస్తూ దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img