Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

రాహుల్‌పై బీజేపీ కక్షసాధింపు

. కాంగ్రెస్‌ నేత ఇంటికి పోలీసులు
. ఆందోళనకు దిగిన కార్యకర్తలు`అరెస్టు
. ఖాకీల చర్యపై హస్తం నేతల మండిపాటు

న్యూదిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని అప్రతిష్ఠపాల్జేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని హస్తం పార్టీ నేతలు విమర్శించారు. రాజకీయ ప్రచారాల్లో చేసే వ్యాఖ్యలపై కేసులు పెడుతూ ఆయనకు చెడ్డ పేరు తెచ్చేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా దేశంలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రంలోని మోదీప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పూనుకుందని ఆరోపించారు. ఆదివారం దిల్లీ పోలీసు ప్రత్యేక పోలీసు కమిషనర్‌ (లా అండ్‌ ఆర్డర్‌) సాగర్‌ ప్రీత్‌ హుడా నేతృత్వ బృందం రాహుల్‌ నివాసానికి నోటీసులతో వెళ్లింది. లైంగిక వేధింపుల బాధితుల వివరాలు ఇవ్వాలని ఆయనకు సూచించినట్లు చెప్పారు. ఉదయం 10 గంటలకు వచ్చిన పోలీసులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉన్నారన్నారు. దిల్లీ పోలీసుల చర్యపై కాంగ్రెస్‌ మండిపడిరది. తీవ్రంగా ఖండిరచింది. కేంద్రం కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఇంతలా వేధింపులకు గురిచేయడం ఏమిటంటూ నిలదీసింది. మరోవైపు బీజేపీ తమపై కాంగ్రెస్‌ ఆరోపణలను తోసిపుచ్చుతూ పోలీసులు తమ పనిని వారు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. తాజా పరిణామాల క్రమంలో రాహుల్‌ ఇంటి వద్ద భద్రత పెంచారు. పోలీసు బృందం ఉండగానే కాంగ్రెస్‌ నేతలు పవన్‌ ఖేరా, అభిషేక్‌ మను సింఫ్వీు, జైరాం రమేశ్‌ తదితరులు రాహుల్‌ నివాసానికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు కొందరు రాహుల్‌ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. నినాదాలు చేశారు. ఐదారుగురిని పోలీసులు నిర్బంధించారు.
రాహుల్‌కు బెదిరింపులువేధింపులు.: కాంగ్రెస్‌ నేతలు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌తో పాటు జైరాం రమేశ్‌, అభిషేక్‌ సింఫ్వీు కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఇది కక్షసాధింపుతో పాటు బెదిరించేవేధించే యత్నం. రాహుల్‌పై బురదజల్లే ప్రయత్నం. ఆయనపై వ్యతిరేకత సృష్టించే కుట్ర’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ ప్రచారాల్లో భాగంగా ప్రతిపక్ష నేతలు చేసే వ్యాఖ్యలపై కేసులు పెడుతున్న వైనం చెడు ప్రభావాన్ని చూపుతుందని గెహ్లాట్‌ అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు, కేంద్రమంత్రులు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చని హెచ్చరించారు.
రాహుల్‌ దగ్గర వివరాలున్నాయిగా!: బీజేపీ ఎద్దేవా
ఆ బాధితులకు న్యాయం జరిగేందుకు సంబంధిత సమాచారాన్ని పోలీసులకు రాహుల్‌ గాంధీ అందించాలి. ఆయా వివరాలు ఆయన వద్ద ఉన్నాయి కదా అంటూ బీజేపీ వ్యంగాస్త్రాలు సంధించింది. తమ పార్టీపై కాంగ్రెస్‌ ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర తిప్పికొట్టారు.
‘కొన్ని ఘటనల గురించి గాంధీ చెప్పారు… అందుకే దిల్లీ పోలీసులు న్యాయపరంగా చర్యలు చేపట్టి వివరాల కోసం ఆయన వద్దకు వెళ్లారు. పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు. భారత్‌ జోడో యాత్రలో తనను కలిసిన కొందరు మహిళలు తాము అత్యాచారం, లైంగిక వేధింపుల బాధితులమని, తమకు న్యాయం జరగలేదని చెప్పారని రాహుల్‌ అన్నారు. ఇదే విషయంలో దిల్లీ పోలీసులు వివరాలు కోరుతుంటే ఆయన ఇవ్వడంలేదు. దీనిని బట్టి ఆయనకు న్యాయం కల్పించేందుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నది అర్థమవుతోంది. ఆయన అబద్ధం చెప్పలేదుగా!’ అని బీజేపీ నేత అమిత్‌ మాళవియా ట్వీట్‌ చేశారు.
బాధితుల వివరాలివ్వమన్నాం…: పోలీసు కమిషనర్‌ హుడా రాహుల్‌ కొందరు మహిళలు లైంగింకంగా వేధించబడినట్లు చెప్పారు కాబట్టి ఆయన యాత్ర దిల్లీ గుండా సాగిన క్రమంలో బాధితుల్లో ఎవరైనా తన వద్దకు వచ్చి ఇలా చెబితే వారి వివరాలు ఇవ్వమని అడిగేందుకే వెళ్లాం అని ప్రత్యేక పోలీసు కమిషనర్‌ హుడా అన్నారు.. ఇది తేలిగ్గా తీసుకునే అంశం కాదని చెప్పారు. స్థానికంగా దర్యాప్తు జరిపిస్తే అలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవని, బాధితులు ఎవరూ లేరన్నారు. మరి రాహుల్‌ను కలిసిన వారెవరో చెబితే విచారణ జరుపుతామని చెప్పారు. ఇదే వ్యవహారంలో రాహుల్‌ను కలవడం ఇది మూడవసారని, బాధితులకు న్యాయం చేద్దామన్నదే ఉద్దేశమని హుడా తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img