పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌కు మొగ్గు చూపుతున్న టీనేజర్లు
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా భారత సర్కారు 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌కు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. టీనేజర్లు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌కు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 1,24,02,515 టీకా డోసులు తీసుకున్నట్లు తేలింది..టీనేజర్లు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ తీసుకోవడంపై కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవియా యువతను అభినందించారు. అర్హులైన వారు వీలైనంత త్వరగా టీకాలు తీసుకోవాలని మంత్రి యువతకు సూచించారు. బుధవారం ఒక్కరోజే 37,44,635 డోసులు టీనేజర్లు తీసుకున్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 148.58 కోట్లకుపైగా డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది.