Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్‌తో పట్టుబడిన పాక్‌ పడవ.. ఆరుగురు అరెస్ట్‌

. పాక్‌ పడవలో డ్రగ్స్‌ భారత్‌లోకి మాదక ద్రవ్యాలను పంపేందుకు దాయాది పాకిస్థాన్‌ చేసిన ప్రయత్నాలను గుజరాత్‌ ఏటీఎస్‌ తిప్పికొట్టింది. తీరప్రాంత గస్తీ దళం, ఏటీఎస్‌ సంయుక్త ఆపరేషన్‌ చేపట్టి బోటు ద్వారా తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ను గుజరాత్‌ తీరంలో పట్టుకున్నాయి. వెంటనే బోటును సీజ్‌ చేసి ఆరుగురు పాకిస్థానీలను అరెస్ట్‌ చేసింది. కచ్‌ జిల్లా జకావ్‌ ఓడరేవు సమీపంలోని సముద్రంలో చేపలు పట్టే పడవ ద్వారా హెరాయిన్‌ తరలిస్తున్నట్లు కోస్టుగార్డు, ఏటీఎస్‌ సిబ్బంది గుర్తించారు. వెంటనే సంయుక్త ఆపరేషన్‌ చేపట్టి దుండగులను పట్టుకున్నాయి. డ్రగ్స్‌ను గుజరాత్‌ తీరానికి చేర్చి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పంజాబ్‌ తరలించాలని పథక రచన చేసినట్లు అధికారులు వెల్లడిరచారు. నిందితుల నుంచి ఒక్కొక్కటీ కిలో బరువున్న 40 హెరాయిన్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ‘అల్‌ తయాసా’ అనే పేరుతో ఉన్న చేపలు పట్టే పడవలో డ్రగ్స్‌ తరలిస్తున్నట్టు పక్కా సమాచారం రావడంతో సముద్రం మధ్యలోనే దానిని చుట్టుముట్టామని ఏటీఎస్‌ అధికారులు తెలిపారు. అంతేకాదు, ఈ డ్రగ్స్‌ను ఎవరి పేరుతో పంపుతున్నదీ గుర్తించామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img