Friday, October 7, 2022
Friday, October 7, 2022

రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌..300 యూనిట్ల వరకు విద్యుత్‌ ఫ్రీ…

గుజరాత్‌ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ హామీలు

త్వరలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ అధికార బీజేపీతో అమీతుమీకి సిద్ధమైంది. మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి ఎదురవుతున్న పోటీని కూడా దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన హామీలను రూపొందించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ హామీలను అగ్రనేత రాహుల్‌ గాంధీ సోషల్‌ మీడియాలో వెల్లడిరచారు. పరివర్తన్‌ సంకల్ప్‌ సమ్మేళన్‌ పేరిట కీలక అంశాలను ట్వీట్‌ చేశారు.
కాంగ్రెస్‌ ఎన్నికల హామీలు…

  1. రూ.500 కే గ్యాస్‌ సిలిండర్‌
  2. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
  3. రూ.10 లక్షల ఖర్చు వరకు ఉచిత వైద్యం
  4. రూ.3 లక్షల వరకు రైతులకు రుణ మాఫీ
  5. రాష్ట్రంలో 3 వేల ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటు
  6. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం
  7. లీటర్‌ కు రూ.5 చొప్పున పాల ఉత్పత్తిదారులకు సబ్సీడీ
  8. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు విధానానికి స్వస్తి. నిరుద్యోగులకు రూ.3,000 భృతి.
    ఇవే తమ తీర్మానాలు అని, గుజరాత్‌ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img