Tuesday, November 29, 2022
Tuesday, November 29, 2022

రెండు ట్రాలీబ్యాగుల్లో 45 తుపాకులు.. భార్యాభర్తల అరెస్ట్‌

రెండు బ్యాగుల నిండా తుపాకులతో దేశంలోకి వచ్చిన ఇద్దరు భారతీయులను దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌(ఎన్‌ఎస్‌జీ) అవి నిజమైన తుపాకులేనని తెలిపారు. అరెస్టయిన ఇద్దరు జగ్‌జిత్‌ సింగ్‌, జస్విందర్‌ కౌర్‌లుగా అధికారులు గుర్తించారు. వారిద్దరినీ భార్యాభర్తలుగా నిర్ధారించారు. కాగా, వారిద్దరూ జూలై 10న వియాత్నం నుంచి భారత్‌కు వచ్చారు. జగ్‌జిత్‌ సింగ్‌ తీసుకొచ్చిన రెండు ట్రాలీబ్యాగుల్లో 45 తుపాకులు లభించాయి. వాటిని అతడి సోదరుడు మంజిత్‌ సింగ్‌ ఇచ్చినట్లు విచారణలో తేలింది. జగ్‌జిత్‌ సింగ్‌ ఫ్రాన్స్‌లోని ప్యారీస్‌ నుంచి వియాత్నంకు వచ్చిన క్రమంలో ఆ ట్రాలీ బ్యాగులను మంజిత్‌ సింగ్‌కు ఇచ్చాడు. అందులోని మొత్తం 45 తుపాకుల విలువ సుమారు రూ.22,50,000 ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img