Friday, June 2, 2023
Friday, June 2, 2023

రెజర్ల ఆందోళనకు మద్దతు తెలిపిన రైతులు..

లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌పై చర్యలు తీసుకోవాలని దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రెజర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. క్రీడాకారులకు పలువురు మద్దతు ప్రకటిస్తున్నారు. సోనిపట్‌కు చెందిన రైతుల బృందం క్రీడాకారులకు మద్దతు తెలుపుతూ.. జంతర్‌మంతర్‌కు బయలుదేరింది. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకునే వరకు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేది లేదని రైతు నాయకులు స్పష్టం చేశారు. సింఘు సరిహద్దుల్లో నిరసన తెలిపిన తరహాలోనే జంతర్‌మంతర్‌ వద్ద నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.ఇప్పటికే క్రీడాకారులకు కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. మరో వైపు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఆరోపిస్తూ ఏడుగురు రెజర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. క్రీడాకారులు చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై శుక్రవారం మరోసారి విచారించనున్నది. అయితే, క్రీడాకారుల ఆందోళనపై రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ స్పందించారు. ఈ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందని, కోర్టే నిర్ణయిస్తుందన్నారు. మరో వైపు లైంగిక వేధింపులపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని బజరంగ్‌ పూనియా విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అసోసియేషన్‌కు చెందిన కొందరు అధికారులు మైనర్‌తో సహా మహిళా రెజర్లను సంప్రదించారని, ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కోరారన్నారు. అందరికీ డబ్బు ఆశ చూపించారని, రెజ్లింగ్ అసోసియేషన్ అధికారులు తన ఇంటికి వెళ్లి ఒత్తిడి తెస్తున్నారని పూనియా పేర్కొన్నాడు. వారికి ఏదైనా జరిగిదే దానికి ప్రభుత్వం, పోలీసులదే బాధ్యతని, అమ్మాయిల పేర్లు ఎలా బయటకు వచ్చాయో కూడా తెలియదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img