Monday, January 30, 2023
Monday, January 30, 2023

రైతుల అహింసాయుత పోరాటం అద్వితీయం

పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ
చండీగడ్‌ : రైతుల అహింసాయుత పోరాటం వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కులను నిలబెట్టడానికి ఒక అద్వితీయమైన సహనం, పరాక్రమమని పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ శుక్రవారం తెలిపారు. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనోద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా చన్నీ రైతులను ప్రశంసిస్తూ ఒక ట్వీట్‌ చేశారు. ‘మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు నిరసిస్తూ గత ఏడాది కాలంగా దిల్లీ సరిహద్దుల్లో కూర్చున్న మన అన్నదాతల అచంచలమైన స్ఫూర్తికి నేను వందనం చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img