ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి నేపథ్యంలో భారతీయ విద్యార్థుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఉక్రెయిన్ నుంచి రొమేనియాలోని సుసెవా సరిహద్దు ప్రాంతానికి వచ్చిన 200 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం దిల్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. ఉక్రెయిన్లో ఉన్న ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అనుమతించాలని ఐక్యరాజ్యసమితి ఎమర్జెన్సీ రిలీఫ్ కోఆర్డినేటర్ అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మార్చి 10న రష్యాతో సమావేశం కాబోతున్నట్లు ఉక్రేనియన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా తెలిపారు. కాగా ఖార్కివ్ సమీపంలో రష్యా మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ను ఉక్రెయిన్ బలగాలు కాల్చిచంపాయని ఉక్రెయిన్ చీఫ్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ మంగళవారం తెలిపింది.