Thursday, August 11, 2022
Thursday, August 11, 2022

లక్నోలో రోడ్డుపై యువతి రచ్చ

ఉత్తరప్రదేశ్‌ లక్నోలో నడిరోడ్డుపై ఓ యువతి రచ్చ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ క్యాబ్‌ డ్రైవర్‌ చెంపలు చెల్లుమనిపిస్తూ హల్‌చల్‌ చేసింది. ఆమె నాన్‌ స్టాప్‌గా అతనిని కొడుతుంటే ట్రాఫిక్‌ పోలీసులతో సహా అక్కడున్నవాళ్లంతా చోద్యం చూస్తూ ఉండిపోయారు. లక్నోలోని అవధ్‌ ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర చోటుచేసుకున్న ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు ఎందుకు కొడుతున్నావని క్యాబ్‌ డ్రైవర్‌ అడగగా అతడి సెల్‌ఫోన్‌ను రోడ్డుకేసి కొట్టింది. అడ్డొచ్చిన మరో వ్యక్తిని కాలర్‌ పట్టుకొని పక్కకు లాగి పడేసింది. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.నను ఢీ కొట్టినందుకే కొట్టినట్లు ఆ యువతి చెబుతోంది. దెబ్బలు తిన్న ఆ యువకుడిపైనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img